ప్రస్తుతం అందరి దృష్టి కల్కి సినిమాపై పడింది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు, తమిళంతోపాట పలు భాషలకు సంబంధించి ఏకంగా రూ. 375 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఏకంగా రూ. 200 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం.