Bhuvaneswari: అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.. షాకింగ్ లుక్
అప్పట్లో ఈమె ఓ సెన్సేషన్. వ్యభిచారం కేసుల్లో అడ్డంగా బుక్కయ్యింది. హాట్ నటిగా పేరు తెచ్చుకుంది. ఎన్నో వివాదాల్లో సైతం ఇరుక్కుంది. ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది.

ఒకప్పుడు తమ అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించిన భామల్లో భువనేశ్వరి ఒకరు. దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో ఆమె తన బ్యూటీతో అలరించింది. పలు తమిళ చిత్రాల్లో సైతం మెరిసింది. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి ఆమె అటు సిల్వర్ స్క్రీన్‌పై, ఇటు బుల్లితెరపై కనిపించలేదు. ఏపీలోని చిత్తూరుకు చెందిన భువనేశ్వరి.. యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తో తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.
ఆ తర్వాత పలువురి చేతిలో మోసపోయింది. ఏదోలా కష్టపడి సీరియల్స్‌లో వేశాలు సంపాదించుకుంది. వచ్చే డబ్బు చాలక అడ్డదార్లు తొక్కింది. వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. అంతేకాదు అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు వెయ్యడం ఆరోజుల్లో సెన్సేషన్. ఆ తర్వాత ఈమె నటనకు గుడ్ బై చెప్పింది. అటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది. తాజాగా ఆమె తిరుమలకి వచ్చింది. తొలుత ఆమెను అక్కడి మీడియా ప్రతినిధులు సైతం గుర్తుపట్టలేదు. ఎవరో వ్యక్తి చెప్పడంతో.. ఆమే తెలిసి కంగుతిన్నారు. మత్తెకించే అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి, వయస్సు మీదపడటంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..