Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈమెను గుర్తుపట్టారా..? మోడ్రన్ డ్రస్‌లో చూసి స్టన్ అవుతున్న నెటిజన్స్.. సూపర్ స్టెప్స్

"స్త్రీ" మూవీలో నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి విభాగంలో నంది బహుమతితో రోణినిని సత్కరించింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది.

Tollywood: ఈమెను గుర్తుపట్టారా..? మోడ్రన్ డ్రస్‌లో చూసి స్టన్ అవుతున్న నెటిజన్స్.. సూపర్ స్టెప్స్
Rohini Molleti
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2023 | 10:45 AM

పైన ఫోటోలో ఉన్న ఆవిడను గుర్తుపట్టారా..? కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. ఆమె ఎవరో కాదండీ బాబు. నటి రోహిణి.. ఎక్కువ అమ్మ పాత్రల్లో సినిమాల్లో కనిపించే ఆమెను.. మనం చీరకట్టులోనే చూస్తాం. ఇలా మోడ్రన్ డ్రస్‌లో చూడటం చాలా అరుదు. అందకే ఆమెను చాలామంది గుర్తించలేకపోతున్నారు. రోహిణి గారి గురించి ఏం చెప్పాలి. దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో ఆమె నటించింది.  డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. ఇండస్ట్రీకి బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా హీరోలకు సోదరి పాత్రలు చేసింది. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గా మారింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణించింది.

రోహిణి సినీ ప్రముఖ నటుడు రఘువరణ్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకున్నారు. సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చారు రోహిణి. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. “వీరుక్కు నీర్” అనే టెలీ ఫిల్మ్‌‌కుగానూ  2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా ఆమెను వరించింది. రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది. తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది.

స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై “సైలెంట్ హ్యూస్” అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది. ఇలా ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక రంగాల్లో రాణిస్తున్న విభిన్న ప్రతిభాశాలి ఆమె. ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాలో కథానాయకుడి తల్లి పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..