Pawan Kalyan: పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్టు.. అయితే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆజ్ఞాతవాసి నిరాశపర్చినా సినిమాల్లో వీరి మైత్రి బంధం కొనసాగుతోంది

జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆజ్ఞాతవాసి నిరాశపర్చినా సినిమాల్లో వీరి మైత్రి బంధం కొనసాగుతోంది. పవన్‌తో నేరుగా సినిమా తీయకపోయినా.. ఆయన నటించే సినిమాలకు స్క్రీన్‌ప్లే, మాటలు తదితర వ్యవహారాలు చూస్తున్నారు మాటల మాంత్రికుడు. పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్’ గురూజీ స్క్రీన్‌ప్లేతోపాటు ఓ పవర్‌ఫుల్ సాంగ్ రాసిన సంగతి తెలిసిందే. ఇక సముద్రఖని దర్శకత్వంలో పవన్- సాయి ధరమ్‌తేజ్ నటిస్తోన్న వినోదయ సీతం తెలుగు రీమేక్‌కు కూడా తన వంతు సాయం అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కోసం తాను కూడా ఓ కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్. అయితే దీనిని తెరకెక్కించే బాధ్యతను మరో యువ దర్శకుడికి అప్పగించారట. అతనెవరో కాదు స్వామిరారా ఫేం సుధీర్ వర్మ. ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజతో కలిసి రావణాసుర సినిమాను తెరకెక్కిస్తున్నాడీ యంగ్ డైరెక్టర్. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుధీర్ పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘గతంలో నిఖిల్‌తో నేను తీసిన కేశవ సినిమా నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌కి నచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి దాని గురించి నాతో మాట్లాడారు. కొన్నాళ్ల తర్వాత, త్రివిక్రమ్ తాను ఓ కథా పాయింట్‌ను నాకు చెప్పి, దానిపై సినిమా చేయాలన్నారు. పవన్ కల్యాణ్‌కు తాను చెప్పిన ఐడియా నచ్చిందన్నారు. సినిమా ఎప్పుడుంటుందనే సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు’ అని సుధీర్ పేర్కొన్నారు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయ్యేలా లేదు. ఎందుకంటే పవన్ చేతిలో ప్రస్తుత నాలుగు సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ తో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి తర్వాత సుజీత్‌తో ‘ఓజీ’, హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత సుధీర్ డైరెక్షన్‌లో పవన్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Political thriller aithe bagundu.. #PSPK31 pic.twitter.com/0Fmyp1rhPE
— Pawanfied (@Only_PSPK) March 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..