Hombale Films: బాలీవుడ్ బడా హీరోతో హోంబాలే ఫిల్మ్స్.. బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఇప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలను అందించింది. అందులో ఎక్కువగా కమర్షియల్ యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఇప్పుడీ సంస్థ మొదటిసారిగా బాలీవుడ్ లో సినిమా చేస్తుంది. తాజాగా బాలీవుడ్ బడా హీరోతో సినిమా చేస్తుంది.. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ ..

హోంబాలే ఫిల్మ్స్.. ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ పేరు తెగ వినిపిస్తుంది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ నిర్మాణ సంస్థ బడా సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కన్నడ సినిమాలకు మార్కెట్ లేదు. పరిమిత బడ్జెట్‌తో మాత్రమే సినిమాలు నిర్మించాలనే చర్చ నడుస్తున్న సమయంలో, ఈ నిర్మాణ సంస్థ ఊహించని బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించడమే కాకుండా, దేశవ్యాప్తంగా కన్నడ చిత్రాలను పరిచయం చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏడాదికేడాది తన పరిధిని విస్తరిస్తున్న హోంబాలే ఫిల్మ్స్, ఇప్పుడు మలయాళం, తెలుగు , తమిళంతో పాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
హోంబాలే ఫిల్మ్స్ బాలీవుడ్ సినిమాను నిర్మిస్తుందనే వార్తలు గతంలోనూ వినిపించాయి, కానీ ఆ సినిమాను ఏ హీరోతో నిర్మిస్తుందో క్లారిటీ రాలేదు. ఇప్పుడు, హోంబాలే తన తొలి హిందీ పాన్-ఇండియా చిత్రాన్ని ప్రకటించింది. బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ బడా హీరోతో భారీ సినిమాను నిర్మించడానికి హోంబాలే ఫిల్మ్స్ రెడీ అయ్యింది. గతంలో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు, ఊహించని రీతిలో హోంబాలే హృతిక్ రోషన్‌తో ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్ర దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కథను ఖరారు చేశారని, స్క్రీన్ ప్లే దశలో ఉందని అంటున్నారు.
ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి
‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించిన హోంబాలే, ఇప్పుడు హృతిక్ రోషన్ నటించిన చిత్రంతో సహా మొత్తం ఎనిమిది చిత్రాలలో పెట్టుబడి పెట్టింది. ‘కాంతారా చాప్టర్ 1’, యానిమేషన్ చిత్రం ‘మహావతార నరసింహ’, రక్షిత్ శెట్టి ‘రిచర్డ్ ఆంటోని’ ఇలా మూడు సినిమాలతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సినిమా చేయనుంది. మలయాళ సినిమా ‘టైసన్’తోపాటు ఇప్పుడు బాలీవుడ్ సినిమా ప్రకటించబడింది. మరి ఈ సినిమా ఇలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. హృతిల్క్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ అదరగొట్టేశారు.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..
View this post on Instagram
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








