రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి
సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో గ్లామర్ టచ్ ఎక్కువగానే ఇస్తున్నారు దర్శకులు. ఏ జోనర్ సినిమా అయినా సరే కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉండాల్సిందే.. మినిమమ్ లిప్ కిస్ లేకుండా సినిమాలు రావడం లేదు. అయితే హీరోయిన్స్ కూడా ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి వెనకాడటం లేదు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కేవలం పాటలకోసమే అన్నట్టుగా ఉంటున్నాయి. అయితే మరికొంతమంది భామలు మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోలతో సమానంగా నటనలోనూ మార్కులు కొట్టేస్తున్నారు. అలాగే గ్లామర్ రోల్స్ కు కూడా దూరంగా ఉంటున్నారు. చాలా మంది భామలు స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ లు చేయడానికి నో చెప్పుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకుందట. అయితే ఓ హీరో తనను లిప్ కిస్ పెట్టుకున్నాడని ఏకంగా 100సార్లు మొఖం కడుక్కుందట.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..
సినిమా షూటింగ్ లో అనుకోకుండా ఓ హీరో తనను కిస్ చేసినందుకు వందసార్లు ముఖం కడుక్కున్నా హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ రవీనా టాండన్. రవీనా టాండన్ బాలీవుడ్ లో ఫెమస్ నటి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది. రీసెంట్ గా కేజీఎఫ్2 సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఆమె గతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది.
ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
ఓ సినిమా షూటింగ్ లో తనను రఫ్ గా హ్యాండిల్ చేశారని. ఆ షూటింగ్ లో అనుకోకుండా ఓ హీరో పెదాలు తనపెదాలను తగిలాయని దానితో చాలా ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చింది. అది కిస్సింగ్ సీన్ కాదు అయినా కూడా అది పొరపాటున జరిగింది. దాంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు వికారంగా అనిపించింది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. వెంటనే వెళ్లి వాంతులు చేసుకున్నాను. బ్రష్ చేసుకొని ఓ వందసార్లు మొఖం కడుక్కున్నా అని చెప్పుకొచ్చింది. అలాగే ఆ హీరోకు ఎలాంటి ఉద్దేశం లేదు. షాట్ తర్వాత అతను క్షమాపణ కూడా చెప్పాడు అని తెలిపింది. అలాగే ఇప్పటికీ కూడా తాను ఎప్పుడు కిస్సింగ్ సీన్ లో నటించలేదు అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్. త్వరలోనే రవీనా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








