AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

ఇండస్ట్రీలో చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే చిన్న వయసులోనే కన్నుమూసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ గా మారింది. 15 ఇండస్ట్రీ హిట్స్ లో నటించింది. కేవలం 36 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసింది ఈ హీరోయిన్.

పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..
Actress
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 9:05 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగారు. తమ అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. స్టార్ హీరోల సరసన నటించింది. ఇండస్ట్రీలోని ధృవ తారగా నిలిచింది. కానీ చిన్న వయసులోనే కన్ను మూసి ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చింది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపతున్న ఆమె 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టుంది. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కాగా 32 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు వారిలో ఈ స్టార్ హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరో కాదు. అలనాటి అందాల తార మధుబాల. సీనియర్ హీరోయిన్ మధుబాలఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రసిద్ధ నటీమణులలో ఒకరు. హిందీ సినిమాల్లో తన అసాధారణ సౌందర్యం, నటనా ప్రతిభతో గుర్తింపు పొందింది. ఆమె ముంబైలో జన్మించి, బాల నటిగా తన కెరీర్ ప్రారంభించింది.

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

14ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. “ముగల్-ఎ-ఆజం” సినిమాలో అనార్కలి పాత్రలో ఆమె నటన ఆమెను శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేసింది. బాలీవుడ్ లోనే ముగల్-ఎ-ఆజం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. మధుబాల మహల్ (1949), చల్తీ కా నామ్ గాడీ (1958), బర్సాత్ కీ రాత్ (1960) వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె 15 ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మధుబాల అందం, అద్భుతమైన నటనతో అభిమానులు, సినీ విశ్లేషకులు “వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా”గా పిలిచేవారు.. అయితే, ఈ స్టార్ హీరోయిన్ గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడి, కేవలం 36 సంవత్సరాల వయస్సులోనే 1969లో మరణించింది. పుట్టుకతోనే మధుబాల గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నటుడు దిలీప్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం. తర్వాత గాయకుడు కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే