AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinidhi Shetty: అవన్నీ అబద్దం.. నేను ఆ సినిమాను రిజక్ట్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన శ్రీనిధి శెట్టి

నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీనిధి శెట్టి హిట్ 3 సినిమాతో తెలుగులో సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది.

Srinidhi Shetty: అవన్నీ అబద్దం.. నేను ఆ సినిమాను రిజక్ట్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2025 | 4:13 PM

కన్నడ స్టార్ జీరో యాష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి. కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. అంతే కాదు విడుదలైన అన్ని ఏరియాల్లో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో హీరో యశ్ తో పాటు హీరోయిన్ శ్రీ నిధి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కేజీఎఫ్ 2లోనూ నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాదించిన తర్వాత ఈ చిన్నది తమిళ్ సినిమా కోబ్రాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

నేచురల్ స్టార్ నానితో కలిసి హిట్ 3లో నటించింది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు ఇప్పడు తెలుగులో మరో సినిమా చేస్తుంది. ఇక హిట్ 3 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీనిధి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

హిట్ 3 సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీనిధి.. ఆ సినిమా గురించి, అలాగే హీరో నాని గురించి గొప్పగా చెప్పింది. అయితే తనకు రామాయణం సినిమాలో సీత పాత్ర ఛాన్స్ వస్తే నో చెప్పిందని ఓ రూమర్ ఉంది. దీని పై ఆమె స్పందిస్తూ.. రామాయణం సినిమా ఆడిషన్ కు నేను వెళ్ళా.. ఆడిషన్ ఇచ్చా.. కానీ ఆతర్వాత నాకు మేకర్స్ నుంచి సినిమా ఆఫీస్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. పెద్ద సినిమాను, పైగా సీతమ్మ పాత్రను రిజక్ట్ చేసేంత పెద్ద యాక్టర్ ను నేను కాదు అని శ్రీనిధి చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.