AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హిట్-2’ స్క్రిప్ట్ రెడీ..ఇక షూటింగే త‌రువాయి…

ఈ మ‌ధ్య తొలి చిత్రం ‘హిట్’ తో త‌నలో మంచి టాలెంట్ ఉంద‌ని నిరూపించాడు యంగ్ డైరెక్ట‌ర్ శైలేశ్ కొల‌ను. త‌న క‌థ‌తో న్యాచుర‌ల్ స్టార్ నానిని ఇంప్రెస్ చేసి..అత‌డితో డబ్బులు పెట్టించి..విశ్వ‌క్ సేన్ హీరోగా ‘హిట్: ది ఫస్ట్ కేస్’ పేరుతో సినిమా తీసేశాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 28న రిలీజై మంచి విజయమే సాధించింది. అన్ సీజన్లో విడుద‌ల‌వ్వ‌డం మూలాన‌..సినిమాకు వసూళ్లు తగ్గాయి కానీ.. లేదంటే ఇంకా మంచి ఇంపాక్ట్ చూపించేది. ముఖ్యంగా […]

‘హిట్-2’ స్క్రిప్ట్ రెడీ..ఇక షూటింగే త‌రువాయి...
Ram Naramaneni
|

Updated on: May 29, 2020 | 5:43 PM

Share

ఈ మ‌ధ్య తొలి చిత్రం ‘హిట్’ తో త‌నలో మంచి టాలెంట్ ఉంద‌ని నిరూపించాడు యంగ్ డైరెక్ట‌ర్ శైలేశ్ కొల‌ను. త‌న క‌థ‌తో న్యాచుర‌ల్ స్టార్ నానిని ఇంప్రెస్ చేసి..అత‌డితో డబ్బులు పెట్టించి..విశ్వ‌క్ సేన్ హీరోగా ‘హిట్: ది ఫస్ట్ కేస్’ పేరుతో సినిమా తీసేశాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 28న రిలీజై మంచి విజయమే సాధించింది. అన్ సీజన్లో విడుద‌ల‌వ్వ‌డం మూలాన‌..సినిమాకు వసూళ్లు తగ్గాయి కానీ.. లేదంటే ఇంకా మంచి ఇంపాక్ట్ చూపించేది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు శైలేశ్ కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. ఆ తర్వాత అమేజాన్ ప్రైంలోకి వచ్చిన ఈ మూవీ..అక్క‌డ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఏకంగా హీరో విశ్వ‌క్ సేనే చెప్పేశాడు. సినిమా చివర్లో కూడా అందుకు ఛాన్సస్ ఉన్న‌ట్లు నేరేష‌న్ ఇచ్చారు. అయితే ‘హిట్-2’ ప‌నులు ఎప్పుడు మొద‌ల‌వుతాయి.. నానినే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడా అనే విషయాలపై క్లారిటీ రాలేదు. శైలేష్ మధ్యలో వేరే సినిమా ఒకటి చేసి ఆ తర్వాత ‘హిట్-2’ మీద ఫోకస్ పెడ‌తాడ‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఊహించ‌ని విధంగా.. లాక్ డౌన్ వ‌ల‌న టైమ్ దొర‌క‌డంతో శైలేశ్ ‘హిట్-2’ క‌థ‌ మీదే కూర్చునున్నాడ‌ట‌. ఆ సినిమాకు స్క్రిప్టు దాదాపుగా కంప్లీట్ చేశాడ‌ని టాక్. తాను లాక్ డౌన్ సమయాన్ని ఎలా వినియోగించుకున్నానో చూపిస్తూ అతను ట్విట్టర్లో చిన్న వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘హిట్-2’ స్క్రిప్ట్ ఫైల్‌ను చూపించాడు. ఆ ఫైల్ సైజ్ చూస్తే కథ దాదాపుగా కంప్లీట్ అయినట్లే కనిపిస్తోంది. ఈ క‌థ‌ను ఆస్ట్రేలియా రైటర్స్ గైడ్‌లో రిజిస్టర్ చేయించినట్లు.. ఫైల్ మీద నోట్ ఉంది. దీంతో ఇక ‘హిట్-2’ షూటింగ్ మొద‌లెట్ట‌డమే త‌రువాయి అంటున్నారు నెటిజ‌న్లు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..