Bichagadu: బిచ్చగాడు నేను చేయాల్సిన సినిమా.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Bichagadu: బిచ్చగాడు నేను చేయాల్సిన సినిమా.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bichagadu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 25, 2023 | 1:29 PM

బిచ్చగాడు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తోన్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?

బిచ్చగాడు సినిమాలో ముందుగా టాలీవుడ్ హీరోను అనుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన శ్రీకాంత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహాత్మ సినిమాకు విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సినిమా సమయం నుంచి తనకు విజయ్ తో చాలా మంచి పరిచయం ఉందని శ్రీకాంత్ తెలిపారు.

అయితే బిచ్చగాడు సినిమాను నేను తమిళ్ లో చూశాను. నాకు బాగా నచ్చింది. దాంతో తెలుగులో నేను రీమేక్ చేద్దాం అనుకున్నా.. ఈ క్రమంలోనే చర్చలు కూడా జరిపాం. అయితే నా రెమ్యునరేషన్ తో పాటు సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో ఆ రీమేక్ చేయలేకపోయాము.. లేకుంటే బిచ్చగాడు సినిమా తెలుగులో నేను చేసేవాడిని అన్నారు శ్రీకాంత్.Hero Srikanth

ఇవి కూడా చదవండి