Srikanth: ‘నాకు ఓట్లు వేసినవారికి క్షమాపణలు’.. అందుకే రాజీనామా అన్న శ్రీకాంత్
కాగా తమ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై శ్రీకాంత్ స్పందించారు. గతంలో కూడా రెండు ప్యానల్స్ నుంచి గెలిచినవారితో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
కాగా తమ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై శ్రీకాంత్ స్పందించారు. గతంలో కూడా రెండు ప్యానల్స్ నుంచి గెలిచినవారితో ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఇలాంటి కమిటీల వల్ల పనుల సక్రమంగా జరగవని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని అభిప్రాయపడ్డారు. కమిటీలో లేకపోయినా.. తమ సహకారం ఉంటుందని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలు విష్ణు ప్యానల్ చేస్తుందని తమకు అభిప్రాయం ఉందన్నారు. ఓట్లేసిన అందరి మెంబర్స్‌కు శ్రీకాంత్ సారీ చెప్పారు. గతంలో జరిగిన అన్ని సంఘటనలు గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీకాంత్ చెప్పారు.
మా అసోసియేషన్‌లో నరేష్ పాత్రపైన తమకు నమ్మకం లేదన్నారు శ్రీకాంత్. ఎన్నికల నిర్వహణ దగ్గర్నుంచి …ఆయన ప్రవర్తించిన తీరుపై విష్ణుకి చెప్పినప్పటికి…ఎలాంటి రియాక్ష్ రాలేదు. అందుకే వాళ్లతో పనిచేయలేమని డిసైడ్ అయ్యామని చెప్పారు.
Also Read: ‘మా’లో మరో సంచలనం… ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామా
‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్