Ram Charan: ఎక్కడికైనా వెళ్లే ముందు ఆ పని తప్పకుండా చేయాల్సిందే.. చెర్రీ, ఉపాసనలకు నెటిజన్లు హ్యాట్సాఫ్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది
గ్లోబల్ స్టార్ గా మారిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓకే ఒక్క సినిమా చరణ్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ చరణ్ తెలుగు సినిమా ఖ్యాతిని పదింతలు పెంచేశారు. తెలుగోడి సత్తా ఏంటో నిరూపించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ సతీసమేతంగా హాజరయ్యారు. చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లిన భార్య ఉపాసనతో కలిసి వెళ్తుంటారు. అయితే వీరిరువురు ఎక్కడ కైనా వెళ్లే ముందు చేసే పనేంటో తెలుసా..
విదేశాలకు కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్లే సమయంలో చరణ్ , ఉపాసన దేవుడికి పూజ చేసి బయలు దేరుతారట. ఎక్కడికి వెళ్లినా సీతారాముల చిన్న విగ్రహాలను తీసుకువెళ్తారట. అలాగే ఇటీవల విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ సీతారాముల విగ్రహాలను తీసుకువెళ్లారు. ఏ పనిమీద వెళ్లినా ఆ విగ్రహాలకు పూజ చేసి, దండం పెట్టుని బయలుదేరుతారట.
తాజాగా ఆస్కార్ వేడుక వద్దకు బయలుదేరిన సమయంలోనూ ఇలా సీతారాముల విగ్రహాలను ఉంచి పూజ చేసి ఆ తర్వాత ఆస్కార్ కు బయలు దేరారు చరణ్ ఉపాసన. ఇదే విషయాన్నీ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడేటప్పుడు చెప్పాడు.”ఎక్కడికి వెళ్లినా, నా భార్య , నేను ఈ చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ మా ఆచారం, ఇది మన శక్తులకు అలాగే భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది”. అని తెలిపాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Ram CharanRam Charan, Upasana