Rajendra Prasad: నా కూతురిలో మా అమ్మను చూసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.

Rajendra Prasad: నా కూతురిలో మా అమ్మను చూసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్
Hero Rajendra Prasad
Follow us

|

Updated on: Oct 05, 2024 | 7:14 AM

సీనియర్ హీరో, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్‌అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. కన్నా కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్రప్రసాద్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు.

గతంలో బేవార్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మ పై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ.. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు.. నా పదేళ్ల వయసలు మా అమ్మ గారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా.. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు.. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.