టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పిన ప్రకాష్ రాజ్.. అతనంటే ప్రేమ, అభిమానం అంటూ..

ప్రకాష్ రాజ్ టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎవరో చెప్పారు. రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా సొంతం చేసుకుంటుంది.

టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పిన ప్రకాష్ రాజ్.. అతనంటే ప్రేమ, అభిమానం అంటూ..
Prakash Raj
Follow us

|

Updated on: Oct 05, 2024 | 7:49 AM

ప్రకాష్ రాజ్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ పేరు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ నటించి మెప్పించారు ప్రకాష్ రాజ్ . తాజాగా ప్రకాష్ రాజ్ టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎవరో చెప్పారు. రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా సొంతం చేసుకుంటుంది. ఇక దేవర సినిమాను రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా మొదటి భాగం విజయం సాధించడంతో.. దేవర మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

దేవర సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఏర్పాటు చేసిన దేవర సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ, శ్రీకాంత్, రాజమౌళి, అనిరుధ్ రవిచందర్, నందమూరి కల్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.  తాజాగా దేవర మూవీ సక్సెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తన అభిమాన నటుడు తారక్ అని అన్నారు. అలాగే తారక్ పై ప్రశంసలు కురిపించారు ప్రకాష్ రాజ్

దేవర సినిమా ఇంతటి ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం శివ చెప్పిన ఐడియా, దాన్ని నమ్మిన తారక్ అని అన్నారు. తనకు తారక్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉందని అన్నారు. నేనెప్పుడూ చెప్పలేదు. ఆస్కార్ ఫంక్షన్‌లో ఎంతో మంది దిగ్గజాల ముందు తారక్ మాట్లాడుతుంటే తాను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంతో గర్వపడ్డానని అన్నారు. ఈ సినిమా కోసం ఒక దర్శకుడికి తారక్ అండగా నిలబడ్డాడని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను తెలుగు సినిమాల్లో హీరోల్లో నటుల్లో నాకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే అది నా తారక్ అని అన్నారు ప్రకాష్ రాజ్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి