Aadujeevitham: ప్రేక్షకులను మెప్పించిన ఆడుజీవితం.. మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే

పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లాస్లీ, చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా విడుదలకు ముందు సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో సినిమాను చూసిన సినీ ప్రముఖులు సినిమాని ఎంతగానో అభినందిస్తున్నారు. మార్చి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది.? తొలిరోజు సినిమా కలెక్షన్లు ఎంత వసూల్ చేసింది.?

Aadujeevitham: ప్రేక్షకులను మెప్పించిన ఆడుజీవితం.. మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
Adujeevitham
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2024 | 5:42 PM

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ చిత్రం గురువారం (మార్చి 28) విడుదలైంది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లాస్లీ, చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా విడుదలకు ముందు సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో సినిమాను చూసిన సినీ ప్రముఖులు సినిమాని ఎంతగానో అభినందిస్తున్నారు. మార్చి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది.? తొలిరోజు సినిమా కలెక్షన్లు ఎంత వసూల్ చేసింది.?

తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘ఆడుజీవితం’ సినిమా తొలిరోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. స్టార్ నటీనటుల మాస్, కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ అనిపించవచ్చు. కానీ మలయాళ సినిమాకి ఇది చాలా మంచి ఓపినింగ్ అనే చెప్పాలి. గురువారం నాడు 7.45 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వారాంతంలో వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘ఆడుజీవితం’ చిత్రం తెలుగు రాష్ట్రాలు, కన్నడ నుంచి 40 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. తమిళనాడులో 55 లక్షలు రాబట్టగా, హిందీలో కేవలం 10 లక్షలు రాబట్టింది. మిగతావన్నీ కేరళ నుంచే వచ్చాయి. అందులోనూ కొట్టాయం సెగ్మెంట్ నుంచి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని చోట్ల విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

మలయాళ నవల ఆధారంగా ‘ఆడుజీవితం’ సినిమా తెరకెక్కింది. ఈ నవల నిజమైన సంఘటన ఆధారంగా రచించారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి తన ఇష్టం లేకుండా గల్ఫ్ దేశంలో గొర్రెల కాపరి ఉద్యోగంలో చేరి అక్కడి నుంచి తప్పించుకునే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లాస్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్,  జిమ్మీ జిన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.