Ajay Devgn: భోళా సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ హీరో..

ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ రేట్‌ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే.. గత రెండు మూడేళ్లలో నార్త్ ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగే అన్ని సినిమాలు కూడా సక్సెస్‌ కాలేదు.

Ajay Devgn: భోళా సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ హీరో..
Ajay Devgn
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2023 | 9:12 PM

భోళా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ ఆ సినిమాను ఎలాగైన సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నారు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ డీలా పడిపోవటంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని కొత్త కొత్త స్ట్రాటజీస్ ట్రై చేస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ రేట్‌ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే.. గత రెండు మూడేళ్లలో నార్త్ ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగే అన్ని సినిమాలు కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో హిట్ సౌండ్ వినేందుకు హీరోలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకరిద్దరు హీరోలు బిగ్ హిట్స్‌తో సత్తా చాటితే మిగతా స్టార్స్‌ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు.

ఇప్పుడు అజయ్ దేవగన్‌ టర్న్ వచ్చింది. ఈ నెలాఖరున భోళా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అజయ్‌. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ బాలీవుడ్ స్టార్‌. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో కాస్త సీరియస్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. భోళా సినిమాకు దర్శకుడు కూడా తానే కావటంతో మరింత కేర్ తీసుకుంటున్నారు అజయ్‌. అందుకే వరుస ప్రెస్‌మీట్‌లతో హడావిడి చేయటంతో పాటు వింటేజ్‌ బాలీవుడ్ సినిమాను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్టర్స్‌ను 70స్‌, 80స్‌ స్టైల్‌లో డిజైన్ చేయించారు అజయ్‌. ఈ డిజైన్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సౌత్ సూపర్ హిట్ ఖైదీకి రీమేక్‌గా తెరకెక్కిన భోళా మీద నార్త్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒరిజినల్‌ కథలో మార్పులు చేసి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు అజయ్‌. అందుకే సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి భోళా అజయ్‌ని హిట్టు మెట్టు ఎక్కిస్తుందేమో చూడాలి.