AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautham: సుధీర్‏తో స్నేహం, గొడవపై రూమర్స్.. అసలు విషయం చెప్పిన రష్మీ..

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ ద్వారా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు యాంకర్ గా సెటిల్ అయ్యింది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే సుధీర్, రష్మీ జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటుంది.

Rashmi Gautham: సుధీర్‏తో స్నేహం, గొడవపై రూమర్స్.. అసలు విషయం చెప్పిన రష్మీ..
Rashmi
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 10:59 AM

Share

యాంకర్ రష్మీ గౌతమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయిన రష్మీ.. ఛాన్స్ వస్తే.. హీరోయిన్ గా హిట్టు కోసం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై రష్మీ, సుధీర్ జంటకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ జనాలను తెగ ఆకట్టుకుంది. అయితే వీరి స్నేహం గురించి నిత్యం ఏదోక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇంటర్వ్యూ రష్మీ మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్‌తో తన స్నేహంపై నెలకొన్న వదంతులను ఖండించారు. తన సినిమా ప్రమోషన్లకు సుధీర్ మద్దతు ఇచ్చారని, వారి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. సుధీర్ టీవీ షోలకు తిరిగి రావాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమైనది కాదని, అది మేనేజ్‌మెంట్ నిర్ణయమని రష్మి పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

తన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్‌ను పిలవలేదని, కానీ తమ స్నేహబంధం దృష్ట్యా ఆయన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రష్మి తెలిపారు. ఒక స్నేహితుడిగా సుధీర్ తన సినిమా కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చాడని, “నా సినిమా కోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడని రష్మి గుర్తు చేసుకున్నారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని తెలియజేస్తుంది. సుధీర్ తన సినిమా ప్రమోషన్లలో అందించిన సహాయం గురించి వివరించారు. ప్రదీప్, రోషన్ వంటి తన స్నేహితులు తన సినిమాకు మద్దతు పలికారని, అదే విధంగా సుధీర్ కూడా తన కోసం నిలబడ్డాడని ఆమె పేర్కొన్నారు. సుధీర్‌కు తానెప్పుడూ మెసేజ్ చేయాల్సిన అవసరం లేదని, తను ఎప్పుడూ తనకు అండగా నిలబడతాడని రష్మి అన్నారు. వారి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి దూరం పెరగలేదని, బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆమె స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..

ఓ పెద్ద షోను రెండు గంటల పాటు తను ఒక్కతే విజయవంతంగా నడుపుతున్నందుకు రష్మి సంతోషం వ్యక్తం చేశారు. రేటింగ్ పరంగా ఈ షో అద్భుతంగా ఉందని, తన చిలిపి పనులు కూడా షో విజయానికి తోడ్పడ్డాయని ఆమె పేర్కొన్నారు. తన విజయంలో ఆడియన్స్ పాత్ర చాలా ఉందని, తనను ఇంట్లో అమ్మాయిలా చూసుకున్నారని రష్మి అన్నారు. ప్రస్తుతం రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..