Bigg Boss : నా మాజీ లవర్ బాడీ మీద అమ్మాయిల పేర్లు టాటూస్ ఉంటాయి.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఢీ షో ద్వారా బుల్లితెరపై చాలా పాపులర్ అయ్యింది. అదే సమయంలో తన తోటి కంటెస్టెంట్ ప్రేమతో మరింత ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇప్పుడు కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూ తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది. అలాగే తన ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

బుల్లితెరపై డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది నైనిక అనసురు. ఢీ షో ద్వారా తెలుగులో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొంది. టాస్కులలో బాగానే ఫర్ఫామ్ చేసినప్పటికీ ఫినాలే వరకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే కవర్ సాంగ్స్ తో అలరిస్తున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఢీ షో చేస్తున్న సమయంలోనే తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని.. ఫ్యామిలీతో సహా ఎవరూ తన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని.. వేధింపులు కూడా కొంతవరకు భరించాలని చెప్పేవారని.. కానీ తన వల్ల కాలేదని.. ఎవరిని ఏం అనలేక.. ఏం చేయలేక పది మంది ముందు తనను తానే తిట్టుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
ఆ సమస్యతో బాధపుడుతూనే ఏడాదిపాటు తన జీవితాన్ని వృథా చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయేందుకు కూడా ప్రయత్నించానని తెలిపింది. తనకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి పంపించనని తెలిపింది. ఇండస్ట్రీలో చాలా చీకటికోణాలున్నాయని అన్నారు. కొందరు నేరుగా కాల్ చేసి మరీ కమిట్మింట్ అడుగుతుంటారని.. సినిమా ఆఫర్స్ ఇచ్చి కమిట్మెంట్స్ అడుగుతుంటారని తెలిపింది. అలాగే తన మాజీ లవర్ బాడీ మీద అమ్మాయిల పేర్లు టాటూస్ ఉంటాయని తెలిపింది. అలాగే ప్రేమలో ఉన్నవారు తమకు ఇష్టమైన పేర్లను టాటూలుగా వేసుకుంటే కచ్చితంగా విడిపోతారని తెలిపింది.
ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకుంటే.. కాదు పర్సనల్ అన్నారని తెలిపింది. ఆయనేమంటున్నారో అర్థం కాకపోయినా డీల్ ఏంంటో చెప్పండి అన్నానని.. మీ గురించి బయట ప్రచారం జరుగుతుంది. మీకు ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారు అన్నారు. అప్పుడే అర్థమైంది. ఇండస్ట్రీలో ఎంత దరిద్రంగా ఉందో అంటూ చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..
