Taapsee Pannu- Kangana Ranaut: బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ లేడీస్ మధ్య వివాదం చల్లబడిందా.?
గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కంగనా.. తరువాత తనదైన ఛాయిసెస్‌తో అవార్డు విన్నింగ్ స్టార్‌గా మారారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలతో పాటు పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా రియాక్ట్ అవుతూ ఫైర్ బ్రాండ్ అన్న పేరు తెచ్చుకున్నారు.
తాప్సీ- కంగనా బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ లేడీస్. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డేసినా భగ్గుమంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఈ వివాదం మీద ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు తాప్సీ.. కంగనా గ్రేట్ యాక్టర్ అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కంగనా.. తరువాత తనదైన ఛాయిసెస్‌తో అవార్డు విన్నింగ్ స్టార్‌గా మారారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలతో పాటు పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా రియాక్ట్ అవుతూ ఫైర్ బ్రాండ్ అన్న పేరు తెచ్చుకున్నారు. తాప్సీ కూడా గ్లామర్ గర్ల్‌గానే కెరీర్ స్టార్ట్ చేశారు. సౌత్‌లో సక్సెస్ దక్కకపోవటంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు. హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ ఇష్యూస్ మీద తనదైన స్టోల్‌లో సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుస్తుంటారు ఈ ఢిల్లీ బ్యూటీ.
సినిమా కోసం ఎంత రిస్క్ చేయటడానికైనా వెనకాడరు కంగనా. ఆ మధ్య తలైవీ సినిమా కోసం భారీగా బరువు పెరిగారు. తరువాత ధాకడ్ కోసం యాక్షన్ స్టంట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా కోసం గంటల తరబడి ప్రోస్టెటిక్ మేకప్‌తో వర్క్ చేస్తున్నారు. తాప్సీ కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత రిస్క్ అయిన చేస్తారు. రష్మీ రాకెట్ కోసం అథ్లెటిక్ ఫిజిక్ అచ్చీవ్ చేయటం.. శభాష్ మిథు కోసం ప్రొఫెషనల్ రేంజ్‌లో క్రికెట్ నేర్చుకోవటం లాంటివి తాప్సీకి మాత్రమే సాధ్యం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇలా ఒకే స్టైల్‌లో కెరీర్ కంటిన్యూ చేస్తున్న కంగనా, తాప్సీ.. టామ్ జెర్రీలా ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు.
తాప్సీ సినిమాల మీద కంగనా విమర్శలు చేయటం, కంగనా కామెంట్స్‌కు తాప్సీ కౌంటర్‌లు ఇవ్వటం చాలా కామన్.ఇదే విషయంలో రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చారు తాప్సీ. కంగనా, ఆమె చెల్లెలు తనపై విమర్శలు చేసినా.. అలాంటివి తాను పట్టించుకోనంటున్నారు తాప్సీ. ఇప్పుడు కంగనా ఎదురుపడితే నవ్వుతూ పలకరిస్తానన్నారు. కంగనా గ్రేట్ యాక్టర్ అన్న తాప్సీ.. ఆమె విమర్శలను కూడా పాజిటివ్‌గానే తీసుకుంటానన్నారు.