Taapsee Pannu: హీరోయిన్ తాప్సీకి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఏం చేస్తుందో తెలుసా? ఫొటోస్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది. కాగా ఈ క్రేజీ హీరోయిన్ కు ఓ అందాల సోదరి కూడా ఉంది. తన పేరు షగున్ పన్ను.

2010లో ఝుమ్మంది నాదం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది తాప్సీ పన్ను. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ కూడా అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, జుద్వా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే తాప్పీ ఇటీవల తన సోదరి కోసం ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు తనతో కలిసి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేసింది. దీంతో తాప్సీ సోదరి గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
తాప్సీ సోదరి పేరు షగున్ పన్ను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత ముంబైలోని సోఫియా కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఈమె కూడా చూడ్డానికి తాప్సీ లాగే ఎంతో అందంగా ఉంటుంది. హీరోయిన్ కు కావాల్సిన అన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఆ మధ్యన షగున్ కూడా సినిమాల్లోకి వస్తుందని భావించారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం షగున్ వెడ్డింగ్ ప్లానర్ గా బిజి బిజీగా ఉంటోంది. ఇక తాప్సీతో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే సంస్థను స్థాపించింది. ఇందులో షగున్ నే కీలక పాత్ర పోషిస్తోంది.
సోదరితో తాప్సీ
View this post on Instagram
కాగా షగున్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా షగున్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .




