Rashmika Mandanna: నితిన్ సినిమానుంచి తప్పుకున్న రష్మిక.. కారణం అదేనా..
వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రష్మిక. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రష్మిక ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రష్మిక. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. పుష్ప దెబ్బకు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా తనకు తెలుగులో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఛలో సినిమా తర్వాత భీష్మ అనే సినిమా చేసింది రష్మిక. ఇప్పుడు మూడో సినిమా చేయనుంది.
ఈ సినిమాలో కూడా నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మేరకు ఓ క్రేజీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమానుంచి రష్మిక తప్పుకుందని తెలుస్తోంది. రష్మిక ఇప్పుడు బిజీ హీరోయిన్ .. భారీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది ఈ చిన్నది . దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నితిన్ సినిమానుంచి రష్మిక తప్పుకుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.