జనసేనకు హరీశ్ శంకర్ బూస్ట్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వరస ప్లాపులతో ఉన్న పవన్‌కు గతంలో గబ్బర్‌సింగ్‌తో ఇండస్ట్రీ అదిరిపోయే హిట్ ఇచ్చాడు హరీశ్. అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ కిందే చెప్పుకోవాలి. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టున్న వ్యక్తిగా హరీశ్‌కు మంచి పేరుంది. మరోసారి ఈ యంగ్ డైరెక్టర్ పవన్‌తో ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ చిత్ర గురించి పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. పవన్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని టాక్. ఓ సామాన్యుడు ప్రస్తుత విధానాలపై విరక్తి చెంది రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో ఎలా మార్పు తీసుకొస్తాడనే అంశాల్ని ఈ సినిమా కథలో చూపిస్తారని వార్తలు వస్తున్నాయి. పవన్ పొలిటికల్ కెరీర్‌కి ఈ చిత్రం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. హరీశ్ మాత్రం ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అంటున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read :సుశాంత్ రాజ్ పుత్ కేసు, రియాను 10 గంటలపాటు విచారించిన ఈడీ