AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ రాజ్ పుత్ కేసు, రియాను 10 గంటలపాటు విచారించిన ఈడీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈడీ అధికారులు 10 గంటలకు పైగా విచారించారు. ఈ కేసుపై తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినందున ఇంటరాగేషన్ ని వాయిదా వేయాలన్న రియా అభ్యర్థనను వారు తిరస్కరించారు.

సుశాంత్ రాజ్ పుత్ కేసు, రియాను 10 గంటలపాటు విచారించిన ఈడీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 08, 2020 | 11:38 AM

Share

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈడీ అధికారులు 10 గంటలకు పైగా విచారించారు. ఈ కేసుపై తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినందున ఇంటరాగేషన్ ని వాయిదా వేయాలన్న రియా అభ్యర్థనను వారు తిరస్కరించారు. ఈ కేసులో రియాతో బాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, మాజీ మేనేజర్ శృతి మోడీని కూడా ఈడీ విచారించింది. ముంబైలోని తమ కార్యాలయాల్లో వేర్వేరు గదుల్లో వీరిని ప్రశ్నించడం విశేషం.

సుశాంత్ కి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింటి నుంచి రియా అకౌంట్ కి సుమారు 15 కోట్ల ట్రాన్స్ ఫర్ జరిగినట్టు భావిస్తున్నారు. అయితే ఏ కపుల్ అయినా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలా లావాదేవీలు జరగడం సాధారణ విషయమేనని, పైగా వారిద్దరూ కలిసి జీవించారని, హాలిడే వెకేషన్స్ కి వెళ్లారని రియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రియా కుటుంబ సభ్యులతో బాటు సుశాంత్ ఓ కంపెనీని కూడా లాంచ్ చేశాడని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

అంతా నా డబ్బులే..రియా వివరణ:

సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి  రూ. 15 కోట్లను తన బ్యాంకు అకౌంట్ లోకి మళ్లించుకున్నట్టు వచ్చిన ఆరోపణలను రియా చక్రవర్తి తోసిపుచ్చింది. అసలు తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఈడీకి తెలిపింది. తాను, తన సోదరుడు షోవిక్, సుశాంత్ కి సంబంధించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే పెయిడ్ అప్ కేపిటల్ అని, మిగతా సొమ్మంతా తన కష్టార్జితమేనని ఆమె తెలిపింది. నా పేరిట ఉన్నఫ్లాట్ కోసం నేను 60 లక్షలు హోసింగ్ లోన్ తీసుకున్నా.. మిగతా 25 లక్షలు నా సొంత ఆదాయానికి సంబంధించినదే అని రియా వాంగ్మూలమిచ్చింది. కాగా… రియా తండ్రిని కూడా ఈడీ అధికారులు విచారించారు.

Follow Us
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్