”క‌నుబ‌డుట లేదు మూవీ” టీజ‌ర్ లాంచ్ చేసిన డైరెక్ట‌ర్ సుకుమార్

''క‌నుబ‌డుట లేదు మూవీ'' టీజ‌ర్ లాంచ్ చేసిన డైరెక్ట‌ర్ సుకుమార్

అప్‌క‌మింగ్‌ స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమా 'క‌నబ‌డుట లేదు' టీజ‌ర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎస్ ఫిలిమ్స్ శ్రీ పాద క్రియేష‌న్స్ షేడ్ స్టూడియోస్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 12:38 PM

అప్‌క‌మింగ్‌ స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమా ‘క‌నబ‌డుట లేదు’ టీజ‌ర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎస్ ఫిలిమ్స్ శ్రీ పాద క్రియేష‌న్స్ షేడ్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి మ‌ధు పొన్నాస్ సంగీతం స‌మ‌కూర్చ‌గా సందీప్ బ‌ద్దుల సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇదివ‌ర‌కే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఇప్పుడు విడుద‌లైన ఈ టీజ‌ర్‌తో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇక టీజ‌ర్ విష‌యానికొస్తే.. ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది. త‌ప్పిపోయిన వ్య‌క్తి, రెండు మృత‌దేహాలు వాటికి సంబంధించిన అనుమానితుల‌ని విచారించ‌డం వంటి నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు టీజ‌ర్‌ని బట్టి తెలుస్తోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఈ సినిమా రూపొందుతుంది. కాగా ఈ సినిమాలో సుక్రాంత్ వీరెల్ల హీరోగా న‌టిస్తుండ‌గా, యుగ్రాం, శ‌శిత కోన, నీలిమ, ప‌త‌కం శెట్టి సౌమ్యా శెట్టి, కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర్ రావు, కిశోర్, శ్యామ్, మ‌ధు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu