Happy Days: ‘హ్యాపీ డేస్’ బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా? ఇప్పుడేంటి ఇలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్ వైరల్

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హ్యపీడేస్ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, టైసన్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరుల ప్రధాన పాత్రలు పోషించారు

Happy Days: 'హ్యాపీ డేస్' బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా? ఇప్పుడేంటి ఇలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Happy Days Movie Fame Sravs
Follow us

|

Updated on: Jul 29, 2024 | 7:03 PM

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హ్యపీడేస్ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, టైసన్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరుల ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కర్లీ హెయిర్ తో కనిపించిన శ్రావ్స్ (సోనియా దీప్తి)కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె లుక్‌ కు తోడు తన స్వీట్ వాయిస్ కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో సోనియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇదే క్రేజ్ తో కృష్ణుడు నటించిన వినాయకుడు సినిమాతో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమ కూడా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కార్తీ ‘ఆవారా’, మహేశ్ బాబు దూకుడు సినిమాల్లో స్పెషల్ రోల్స్ పోషించింది. శివాజీతో కలిసి బ్రహ్మా లోకం టూ యమలోకం వయా భూలోకం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తెలుగుతో పాటు కొన్ని తమిళ్, కన్నడ సినిమాల్లో నూ నటించింది సోనియా. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమైందీ అందాల తార. చివరగా 2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే అనే సినిమాలో కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసింది సోనియా దీప్తి. ఇదిలా ఉంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్న సోనియా దీప్తి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియా లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లు సోనియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

శ్రావ్స్ (సోనియా దీప్తి) లేటెస్ట్ ఫొటోస్..

Sravs Alias Sonia Deepti

Sravs Alias Sonia Deepti

ఇవి కూడా చదవండి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ప్రమోషన్లలో సోనియా దీప్తి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!