Hansika Motwani: పెళ్లి వేడుకలు షురూ.. వధువుగా ముస్తాబైన హాన్సిక.. ఎంత అందంగా ఉందో చూశారా ?..
తాజాగా శుక్రవారం జరిగిన సూఫీ నైట్ వేడుకల్లో వీరిద్దరు వధూవరులుగా ముస్తాబై కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.
టాలీవుడ్ దేశముదురు బ్యూటీ హాన్నిక మోత్వానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. మరికొద్ది గంటల్లో ఈ ముద్దుగుమ్మ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియుడు సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది. ఇప్పటికే కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న వధూవరుల కుటుంబాలు మెహందీ, సంగీత్, సుఫీ నైట్ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ వేడుకల్లో హన్సిక, సోహైల్ పాల్గొన్నారు. తాజాగా శుక్రవారం జరిగిన సూఫీ నైట్ వేడుకల్లో వీరిద్దరు వధూవరులుగా ముస్తాబై కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.
నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నీతోనే అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. . చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హన్సిక.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.
మరోవైపు హన్సిక నటించిన మహా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటించిన MY3 వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ కు ఎం రాజేష్ దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.