‘గులాబో సితాబో’ రివ్యూ…

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ ఏజ్ పెరుగుతున్న‌కొద్దీ వినూత్న పాత్ర‌ల‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక టిపిక‌ల్ యాక్టింగుతో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ సెట్ చేసుకునారు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా. రెగ్యులర్‌ కమర్షియల్ చిత్రాల‌కు దూరంగా ఆయ‌న విభిన్న‌మైన క‌థ‌లు సెల‌క్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోన్న విష‌యం తెలిసిందే.

'గులాబో సితాబో' రివ్యూ...
Follow us

|

Updated on: Jun 13, 2020 | 12:00 AM

చిత్రం: గులాబో సితాబో యాక్ట‌ర్స్: అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా, బ్రిజేంద్ర కాలా, విజయ్‌ రాజ్‌, ఫరూఖ్‌జఫర్‌, సృష్టి శ్రీవాస్తవ తదితరులు మ్యూజిక్: శంతన్‌, అభిషేక్‌ అరోరా, అంజూ గార్గ్‌ ప్రొడ్యూస‌ర్: రోని లహ్రి, షీల్‌ కుమార్‌ డైరెక్ట‌ర్: సూజిత్‌ సర్కార్‌

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ ఏజ్ పెరుగుతున్న‌కొద్దీ వినూత్న పాత్ర‌ల‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక టిపిక‌ల్ యాక్టింగుతో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ సెట్ చేసుకునారు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా. రెగ్యులర్‌ కమర్షియల్ చిత్రాల‌కు దూరంగా ఆయ‌న విభిన్న‌మైన క‌థ‌లు సెల‌క్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు అంటే ఇక అంచ‌నాలు ఎలా ఉంటాయో తెలిసిందే. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో వీరు చేసి సినిమా ‘గులాబో సితాబో’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకునే సరికి క‌రోనా సైడ్ చేసేసింది. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌లో తీసుకురావాలని మేక‌ర్స్ నిర్ణయించారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ స‌మీక్ష‌లో చూద్దాం..

క‌థ‌

ల‌క్నోలోని ఓ ఓల్డ్ బిల్డింగ్ ఫాతిమా మహల్‌లో పలు కుటుంబాలు అద్దెకు నివసిస్తుంటాయి. దాని ఓన‌ర్ బేగమ్‌(ఫరూక్‌ జఫర్‌) వృద్ధురాలు. ఆమె మిత్రుడు మీర్జా షేక్‌ (అమితాబ్‌ బచ్చన్‌) అక్కడ ఉండే వారి దగ్గర నుంచి అద్దె బ‌కాయిలు వసూలు చేస్తుంటాడు. బాన్‌కీ(ఆయుష్మాన్‌ ఖురానా) తన తల్లి, ముగ్గురు చెల్లెళ్లతో కలిసి అక్క‌డే చాలా ఏళ్లుగా అద్దెకు ఉంటాడు. అయితే, ఎప్పుడూ సరిగ్గా అద్దె చెల్లించకుండా సాకులు చెప్తూ కాలం గ‌డిపేస్తుంటాడు. ఒకరోజు బాన్‌కీ కోపంతో చేసిన త‌ప్పు కారణంగా ఫాతిమా మహల్‌, దాని ఓనర్‌షిప్‌పై అగ్గి రాజుకుంటుంది. అసలు ఫాతిమా మహల్‌ ఎవరిది? మీర్జా, బాన్‌కీల మధ్య మొదలైన గొడ‌వ ఎన్ని మ‌లుపులు తిరిగింది అనేది ఈ చిత్ర క‌థ‌. అది తెలియాలంటే మూవీ చూడాల్సిందే!

ఎలా ఉందంటే?

సూజిత్‌ సర్కార్ అంటే క‌చ్చితంగా విభిన్న‌త కోరుకుంటారు ఆడియెన్స్. ‘విక్కీ డోనర్‌’, ‘పీకూ’, ‘అక్టోబరు’ చిత్రాలే స‌గ‌టు ప్రేక్ష‌కుడిలో అటువంటి ఊహ‌లే రేపుతాయి. అత‌డికి అమితాబ్‌, ఆయుష్మాన్‌ ఖురానా దొరికారు. ఇక చెప్పేది ఏముంటుంది. కానీ ‘దురాశ దుఖాఃనికి చేటు’ అనే చిన్న పాయింట్ తోనే మూవీ క‌థ న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ హాఫ్‌ అద్దె కోసం మీర్జా, బాన్‌కీల మధ్య జరిగే చిన్న గొడవలతో సరదాగా సాగిపోతుంది. పురావస్తుశాఖ అధికారిగా గణేశ్‌ శుక్లా ఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుంచి క‌థ మ‌లుపు తిరుగుతుంది. అయితే సెకండాఫ్ లో స్కీన్ ప్లే నెమ్మ‌దిగా సాగుతుంది. చూసిన సీన్లే చూస్తున్నామా అన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. మ‌న‌సును పిండేసే సీన్లు ఎక్క‌డా తార‌స‌ప‌డ‌వు. అంతా ఫ్లాట్‌గా సాగిపోతుంది. పైగా కథ అంతా ఫాతిమా మహల్‌ చుట్టూ తిరగడం కూడా కొంత బోర్ ఫీలింగ్ క‌లిగిస్తుంది.

ప్ల‌స్ పాయింట్…

అమితాబ్‌, ఆయుష్మాన్‌ ఖురానా న‌ట‌న‌ టెక్నిక‌ల్ టీమ్

మైన‌స్ పాయింట్స్

క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం స్లో స్క్రీన్ ప్లే

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..