Tollywood: సాగరకన్యలా మారిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ టాప్ బ్యూటీ ఈ క్యూటీ
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్నా హీరోయిన్ ఎవరో తెలుసా
సినిమా తరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోలనుంచి రీసెంట్ పిక్స్ వరకు ఎదో ఒకటి అభిమానులు షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్నా హీరోయిన్ ఎవరో తెలుసా. ఈ అమ్మడిని గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ చిన్నదాని పేరు మారుమ్రోగిపోతోంది. అంతే కాదు తమిళ్ లోనూ హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బిజీగా గడిపేస్తోంది ఈ వయ్యారి భామ. ఇంతకు ఈ సాగర కన్య ఎవరంటే..
సముద్రంలో ఇలా సాగరకన్యలా జలకాలాడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు. బుట్టబొమ్మ పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. తక్కువ సమయంలోనే పూజ స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. అక్కినేని నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పూజ హెగ్డే. ఆ తర్వాత ముకుంద సినిమాలో నటించింది. ఇది వరుణ్ తేజ్ తొలి సినిమా ఈ రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన పూజ.. ఆతర్వాత వచ్చిన డీజీ సినిమాలో ఏకంగా బికినీతో షాక్ ఇచ్చింది. ఈ అమ్మడి గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు. ఇక ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటోంది.
View this post on Instagram
నేడు ఈ బ్యూటీ బర్త్ డే. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. పూజ తల్లిదండ్రులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఇక సోషల్ మీడియా వేదికగా పూజాహెగ్డేకు విషెస్ వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో, కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.