Allu Arjun: “వన్” అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్.. ఇండియన్ నెంబర్ వన్‌గా అల్లు అర్జున్

పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్‌తో.. వరల్డ్ వైడ్ ఏదో రకంగా రీసౌండ్ చేస్తూనే ఉన్నారు. కామన్ పీపుల్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా..తనను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా..

Allu Arjun: వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్.. ఇండియన్ నెంబర్ వన్‌గా అల్లు అర్జున్
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 13, 2022 | 5:16 PM

ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. బన్నీ నటన, స్టోరీ, సుకుమార్ డైరెక్షన్ ఇలా అన్ని కలిపి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్‌తో.. వరల్డ్ వైడ్ ఏదో రకంగా రీసౌండ్ చేస్తూనే ఉన్నారు. కామన్ పీపుల్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా..తనను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా.. కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకుని.. ఎట్ ప్రజెంట్ ఇండియన్ నెంబర్ 1 హీరోగా నిలిచారు మన బన్నీ.

పాన్ ఇండియన్ సినిమా పుష్పతో.. రికార్డులన్నీ తన జేబులో వేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డులను స్వీప్ చేశారు. ఇక ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే.. ఇండియన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఢిల్లీ లో జరిగిన గవర్నమెంట్ అఫీయల్ ఈవెంట్లో.. మినిస్టర్ స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు బన్నీ. అందుకోవడమే కాదు.. ఇక ఈ అవార్డుతో.. ఇండియాలోనే టాప్ స్టార్ అనే ట్యాగ్‌ను తెచ్చుకున్నారు. తన ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేలా చేసుకుంటున్నారు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాలో చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మొదటి పార్ట్ కు మించి యాక్షన్ సీన్స్, ట్విస్ట్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..