Mahesh Babu: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సూపర్ స్టార్ నయా ఫోటో.. మరింత యంగ్ గా మహేష్
అయితే ఈ సారి థియేటర్స్ కూడా దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే మహేష్ తల్లి ఇందిరదేవి మరణించడంతో త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం మునుపెన్నడూ రాయని కథను తెరకెక్కిస్తున్నారు మన మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే చేసిన రెండు సినిమాలతో మహేష్ ఫ్యాన్ ను ఫుల్ ఖుష్ చేశారు. సినిమాల రిజల్ట్ థియేటర్స్ లో ఒకలా ఉంటే టీవీల్లో మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే.. అయితే ఈ సారి థియేటర్స్ కూడా దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే మహేష్ తల్లి ఇందిరదేవి మరణించడంతో త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడింది. తల్లి మరణంతో కొండత భాదను మోస్తున్నారు మహేష్. త్వరలోనే ఆ బాధనుంచి బయపట పడి తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం తల్లి మరణం తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు మహేష్. ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేసింది. లాంగ్ హెయిర్ తో చిన్న గడ్డంతో మహేష్ లుక్ సూపర్ అనే చెప్పాలి. ఇప్పటికే మహేష్ న్యూ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేష్ కు సంబంధించిన మరో ఫోటో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు. మహేష్ ఫోటో చూస్తుంటే ఆయన నాలుగు పదుల వయసున్నవాడిలా కాదు పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతోన్న ఫోటోలో మహేష్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ మహేష్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. త్వరలోనే మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే మహేష్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారట. ఈ మూవీలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..