Tollywood: ఈ క్యూటీ చిన్నారి అలనాటి స్టార్ హీరోయిన్ కూతురు.. చారడేసి కళ్ల చిన్నది ఎవరో తెలుసా ?..
అలనాటి కథానాయిక కూతురు.. అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకోలేకపోయింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?..

అందం.. అభినయంతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అలనాటి కథానాయిక కూతురు.. అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకోలేకపోయింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తనే హీరోయిన్ కార్తీక. ఒక్కప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధా కూతురు. 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక.. తొలి సినిమాకే నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తర్వాత జీవా సరసన తమిళంలో తెరకెక్కిన రంగం చిత్రంలో నటించింది. ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో మరింత ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాలేదు. దీంతో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీలో తన తల్లిలాగే స్టార్ డమ్ అందుకుంటుంది అనుకుంటే అంతగా అవకాశాలు రాకపోవడంతో సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తోంది. ఈరోజు కార్తీక బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె తల్లి రాధా తన కూతురి చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసింది.




1992 జూన్ 27న చెన్నైలో జన్మించింది కార్తీక. ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె చెల్లెలు తులసి నాయర్ సైతం హీరోయిన్ గా అడుగుపెట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.