ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
సాధారణంగా హెయిర్ కటింగ్ కి ఎక్కువలో ఎక్కువ ఓ వెయ్యి రూపాయలు ఉంటుంది. పోనీ కాస్త మోడ్రన్‌గా చేస్తే ఓ రెండు వేలు ఇచ్చుకోవచ్చు. కానీ ఇతను తలపై కత్తెర పెడితే అక్షరాలా లక్ష చెల్లించాల్సిందే. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. మీరు విన్నది నిజమే. ఎంతకీ ఎవరాయన అనుకుంటున్నారా.. ? ఇండియాలోనే ది మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్.ఆలీమ్ హకీమ్ కస్టమర్లంతా ఫేమస్ సెలబ్రిటీలే. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు హెయిర్ స్టైలింగ్ కోసం హకీమ్ దగ్గరకు వస్తుంటారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, అలాగే మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువీ, చాహల్ తదతర క్రికెట్ స్టార్లంతా ఈ హెయిర్ స్టైలిస్ట్ దక్కరే కటింగ్ చేయించుకుంటారు. ఇతను మొదట హాలీవుడ్ హెయిర్ స్టైలిష్ట్ గా పనిచేశారు. మొదట్లో ఆలీమ్ హెయిర్ కట్ చేసినందుకు జస్ట్ 20 రూపాయలు మాత్రమే తీసుకునేవారట. అయితే ఆయన పనితనం బాగుండడంతో రోజు రోజుకీ కస్టమర్లు పెరిగిపోయారట. సెలబ్రిటీలు సైతం హకీమ్ దగ్గరకు క్యూ కట్టేవారట. దీంతో ఆయన కూడా తన హెయిర్ కట్ ఫీజు పెంచుకుంటూ పోయారు. వందలు, వేల నుంచి ఇప్పడు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆలీమ్ హకీమ్ ఒక్కో హెయిర్ కట్ కు మినిమం లక్ష రూపాయలు తీసుకుంటున్నాడట. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇది కూడా మినిమమ్ రేట్ మాత్రమేనట. కొన్ని హెయిర్ స్టైల్స్ కు మ్యాగ్జిమం రెండున్నర లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. పలు సినిమాలకు కూడా హాలీమ్ అకీమ్ హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలి సినిమాతో పాటు రాం చరణ్ RC 16 కు ఆయన వర్క్ చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోని పలు క్రేజీ ప్రాజెక్టులకు హకీమ్ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!