Tollywood: చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. అప్పట్లో తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారి..

పవన్ కళ్యాణ్, సూర్య, ప్రభాస్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. అప్పట్లో తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారి..
Actress
Follow us

|

Updated on: Mar 17, 2023 | 9:10 AM

ఒకప్పుడు తెలుగు తెరపై అగ్రకథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న తారలు.. ఆ తర్వాత స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ వరుస అవకాశాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి జాబితాలో ఈ హీరోయిన్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనే అనేక చిత్రాల్లో నటించింది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల బుజ్జాయి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ కళ్యాణ్, సూర్య, ప్రభాస్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

ఆ బూరె బుగ్గల బుజ్జాయి ఎవరంటే.. హీరోయిన్ ఆసిన్. 1985 అక్టోబర్ 26న కేరళలోని కొచ్చిలో జన్మించింది ఆసిన్ తొట్టుంకల్. నటనపై ఆసక్తితో గ్రాడ్యూయేషన్ అనంతరం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2001లో మలయాళంలో నరేంద్రన్ మకాన్ జయకాంతన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది ఆసిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసిన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఇవి కూడా చదవండి

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన గజిని సినిమాతో ఆసిన్ క్రేజ్ మారిపోయింది. తెలుగులో శివకాశి, చక్రం, అన్నవరం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అదే సమయంలో హిందీలో గజిని సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ సరసన ఖిలాడి చిత్రంలోనూ కనిపించింది ఆసిని. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే. మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను 2016లో న్యూఢీల్లోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు ఆసిన్. వీరికి ఆరిన్ అనే పాప ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్.. అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.