పైన ఫోటోలో ఉన్న చిన్నారి 16ఏళ్లకే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. చిన్నవయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. అప్పట్లో ఆమెకు ఫాలోయింగ్ స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉండేది. 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది.. అగ్ర హీరోల సరసన నటించి సినీ ప్రియులను మెప్పించింది. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి. జీవితాన్ని తెలుసుకునేలోపే ఊహించని రీతిలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఆమె మరణంపై ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో. కానీ ఆమె మృతి మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదం. గుర్తుకు వచ్చే ఉంటుంది కదూ.. తనే అలనాటి అందాల తార దివంగత హీరోయిన్ దివ్యభారతి.
1974 ఫిబ్రవరి 24న జన్మించింది దివ్య భారతి. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండా 16 ఏళ్లకో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు దక్షిణాదిలో ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగింది.
తెలుగు, తమిళ భాషల్లో హిట్ చిత్రాల్లో నటించి.. 1992లో విశ్వాత్మ అనే చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే.. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలాతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్న దివ్య భారతి మే 10 న 1992లో రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన సంవత్సరానికే అంటే ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.