యూట్యూబ్లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ చూసి తాను మోడల్ కావాలనుకుంది ముంబై మురికివాడలో ఉండే 13 ఏళ్ల అమ్మాయి. కానీ రోజూ తాను చేసేది ఆకలిపై పోరాటం. ఆ అమ్మాయి కల పెద్దదే.. ఆమె కోరిక కూడా బలమైనదే. కానీ ఇప్పుడు తన కలే నిజమైందీ.. 14 ఏళ్లకే అంతర్జాతీయ మోడల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె కోసం ప్రపంచంలోని పెద్ద సంస్థలు క్యూకడుతున్నాయి.