Tollywood: దీపాల కాంతులలో వెండితెర యువరాణి.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా ? ..
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం యంగ్ హీరోస్ సరసన మాత్రమే కాదు.. అగ్రహీరోలతో జతకట్టేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో జాబితాకు చెందిన ఓ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పైన ఫోటో చూశారు కదా.. అందులో ఉన్న అందాల తార ఎవరో గుర్తుపట్టగలరా ?.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో కొత్త హీరోయిన్ల జోరు కొనసాగుతుంది. తొలి సినిమా హిట్టయితే వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం యంగ్ హీరోస్ సరసన మాత్రమే కాదు.. అగ్రహీరోలతో జతకట్టేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో జాబితాకు చెందిన ఓ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పైన ఫోటో చూశారు కదా.. అందులో ఉన్న అందాల తార ఎవరో గుర్తుపట్టగలరా ?.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అందం, అభినయంతోనే కాకుండా.. డ్యాన్స్తోనూ అదరగొట్టేస్తుంది. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలోనే సత్తా చాటుతుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఆ క్యూటీ.. హీరోయిన్ శ్రీలీల. ఈరోజు (జూన్ 14న) ఈ యంగ్ హీరోయిన్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శ్రీలీల లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. మొదటి చిత్రానికే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక ఆ తర్వాత ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. ఈరోజు ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు మరదలి పాత్రలో నటిస్తుంది.




ఇవే కాకుండా.. పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా.. నితిన్ కొత్త ప్రాజెక్టులో.. రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మాస్ యాక్షన్ డ్రామాలోనూ నటిస్తుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రంలోనూ ఈ బ్యూటీ కనిపించనుంది. ఇవే కాకుండా మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
