Tollywood: ఈ చిన్నారి బుట్టబొమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?.. సహజ నటనతో మెప్పించిన తెలుగమ్మాయి..
ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన త్రోబ్యాక్ ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనే హీరోయిన్ అంజలి. ఈరోజు తెలుగమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఏపీలో జన్మించిన అంజలి.. ముందుగా జీవా నటించిన డేర్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అయితే ఆ తర్వాత షాపింగ్ మాల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో సంధ్య పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ జర్నీ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సైతం హిట్. దీంతో తెలుగులో అంజలికి వరుస ఆఫర్స్ వచ్చాయి. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి అలరించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే.. కల్లాకపటం ఎరుగని అమ్మాయిగా అంజలి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.




ప్రస్తుతం అంజలి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె గేమ్ చేంజర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. అలాగే విశ్వక్ సేన్ నటిస్తోన్న VS11 చిత్రంలోనూ నటిస్తుంది అంజలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.