Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. కామెడీ, రియాల్టీ షోలతో యాంకర్ గా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అలాగే సుధీర్, రష్మీ రీల్ జోడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు షోలకు యాంకరింగ్ చేస్తూనే..మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మీ.
తాజాగా రాజమండ్రి గోదావరి నదిలో అస్తికలు కలుపుతున్న వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ స్టార్ యాంకర్. ఇంతకీ రష్మీ కలిపిన అస్తికలు ఎవరివో తెలుసా.. తన పెంపుడు కుక్క చుట్కీవి. సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలను కుటుంబసబ్యులు, పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలను రాజమండ్రి దగ్గరున్న నదిలో కలిపింది.కొన్నాళ్లుగా తాను ఎంతగానో ప్రేమించిన తన పెంపుడు కుక్కకు కన్నీటి వీడ్కోలు పలికింది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు కుక్క చుట్కీ చనిపోయిందని చెబుతూ రష్మీ ఎమోషనల్ అయింది. తాజాగా చుట్కీ అస్థికలను తీసుకువచ్చి రాజమండ్రి నదిలో కలిపింది. జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్లు చుట్కీ గౌతమ్’ అంటూ భావోద్వేగానికి గురైంది ఈమె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఫ్యాన్స్‌ను కూడా ఎమోషనల్ అయ్యాలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
