హృతిక్ రోషన్ కొన్ని వేల కోట్లకు అధిపతి.! 

12 March 2025

Prudvi Battula 

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నెపో హీరో తన కష్టమీద వేల కోట్ల సంపాదించారు. అతను ఎవరో కాదు హృతిక్ రోషన్.

హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. తండ్రి సహకారంతో సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చాడు.

తర్వాత తన యాక్టింగ్‎తో ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. సౌత్‎‎లో కూడా హృతిక్‎కి వీర అభిమానులు ఉన్నారు.

క్రిష్ సిరీస్‎తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ బాలీవూడ్ స్టార్ హీరో. ఈ సిరీస్‎లో క్రిష్ 4 తెరకెక్కనుంది.

ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు హృతిక్. ఇందులో తారక్ ఓ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

హృతిక్ అనేక విజయాలు, అపజయాలు చూసి బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

ఇక హృతి క్ రోషన్ ఆస్తుల విలువ 3100 కోట్లు మరియు హృతిక్.. దేశంలోని ఇతర సినిమా స్టార్ వారసుల కంటే ఎక్కువ సంపాదించడానికి ప్రధాన కారణం అతని వ్యాపారం.

అతను హెచ్‌ఆర్‌ఎక్స్ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు. 7300 కోట్ల విలువైన ఆ సంస్థ ద్వారా హృతిక్ రోషన్ కోట్లాది ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.