సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యోదయంతో రోజు మొదలవుతుంది. వందల కోట్ల ఏళ్లుగా ఇదే జరుగుతోంది. భానుడు భగభగమండుతూ.. మనకు వెలుగు పంచుతున్నాడు. భూమ్మీద జీవరాశి మనుగడ కొనసాగుతోందంటే అందుకు కారణం సూర్యుడే. భూగోళంపై అనువైన వాతావరణం ఏర్పడటం కూడా భానుడే దయే. అలాంటి సూరీడు కనుమరుగైతే..? కంటికి కనిపించకుండా మాయమైపోతే.? జీవరాశి మనుగడ కొనసాగుతుందా?
అసలు భూమి ఉంటుందా.. అంతమైపోతుందా? సూర్యుడు మాయమైన తర్వాత ఏమవుతుందన్న ప్రశ్నలన్నీ ఊహాజనితమే. కానీ సూర్యుడి ఆయువు తగ్గిపోతోందంటూ ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేల్చిన బాంబు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం పెంచుతోంది. నిజానికి సూర్యుని గురించి చాలా విషయాలు తెలుసని అనుకుంటాం. కానీ మనకు తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తే రోజు మొదలవుతుంది. పడమట అస్తమిస్తే రోజు ముగుస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రక్రియ ఇది. సూర్యుడి వయసు ఇప్పటికి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు. కానీ భానుడి ఆయువు మరో 460 కోట్ల ఏళ్లు మాత్రమే బాకీ ఉందట. ఆ తర్వాత సూర్యుడి శక్తి నశించిపోతుందట. ఈ మాట అల్లాటప్పాగా చెబుతున్నది కాదు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతున్న అక్షర సత్యం. ఇంతకీ సూర్యుడు చచ్చిపోతే పరిస్థితేంటి..?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి.. చివరకు
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
