Tollywood: ఈ ఫోటోలోని బుడ్డోళ్లు ఎవరో గుర్తుపట్టారా? సౌత్‌లో స్టార్ హీరోలు.. అమ్మాయిలకు క్రష్..
పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న బుడ్డోళ్లను చూశారు కదా.. ఎవరో గుర్తుపట్టారా.? వారిద్దరూ అన్నదమ్ములు. ఇప్పుడు సౌత్‌లో సూపర్ స్టార్స్.
పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న బుడ్డోళ్లను చూశారు కదా.. ఎవరో గుర్తుపట్టారా.? వారిద్దరూ అన్నదమ్ములు. ఇప్పుడు సౌత్‌లో సూపర్ స్టార్స్. ఒకరికి మాస్‌లో పిచ్చ ఫాలోయింగ్ ఉంటే.. మరొకరు అమ్మాయిల మనసును దోచేస్తాడు. ఇద్దరూ కూడా తమిళంలో స్టార్ హీరోలు అయినప్పటికీ.. తెలుగులోకి వీరాభిమానులు ఉన్నారు. అటు తెలుగు.. ఇటు తమిళంలో మంచి క్రేజ్ సంపాదించారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎంచుకుంటారు. ప్రతీ పాత్రలోనూ వైవిధ్యతను చూపిస్తారు. ఎవరో గుర్తుపట్టండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే.. ఓ చిన్న క్లూ.. అందులో ఒకరిని ఇప్పుడు ఫ్యాన్స్ ముద్దుగా ‘రోలెక్స్’ అని పిలుచుకుంటున్నారు.
హా.. ఎస్ కరెక్టే మీరనుకునేది.. ఆ ఇద్దరూ మరెవరో కాదు. తమిళ హీరోలు సూర్య, కార్తీ. 1997లో ‘నెరుక్కు నెర్’ సినిమాతో సూర్య హీరోగా పరిచయం కాగా.. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2007లో ‘పరుతివీరన్’ సినిమాతో కార్తీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సూర్య అటు హీరోగానే కాదు.. నిర్మాతగానూ పెద్ద సక్సెస్ అయ్యాడు. ‘గజిని’, ‘సింగం’, ’24’, ‘నంద’, ‘జై భీమ్’, ‘సూరరై పోట్ట్రు’ లాంటి సినిమాలు సూర్యను స్టార్ హీరోగా నిలిపాయి. ఇటీవల ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్ర సూర్యకు అమోఘమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగా సూర్య తెరకెక్కించిన చిత్రం ‘గార్గి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఇక కార్తీ విషయానికి వస్తే.. 2007లో ‘పరుతివీరన్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత యుగానికి ఒక్కడు, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, సర్దార్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు.