AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsham: ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షంను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?

బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే..

Varsham: ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ  వర్షంను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?
Varsham
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2023 | 4:56 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోల్లో ముందు వరసలో ఉన్న హీరో ప్రభాస్. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. అయితే ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు వర్షం. ఎంఎస్. రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శోభన్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిష నటించింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్- త్రిష కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు ప్లేస్ లో ముందుగా హీరోగా  మరొకరిని అనుకున్నారట. వర్షం సినిమాలో ముందుగా సూపర్ స్టార్  మహేష్ బాబు ను హీరోగా అనుకున్నారట. దర్శకుడు శోభన్ ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబు కోసం రాసుకున్నారట. అయితే శోభన్ మహేష్ కు కథను వివరించగా ఆయన సున్నితంగా తిరస్కరించారట.

వర్షం కథ విన్న మహేష్. ఈ సినిమా కథకు నేను సెట్ కాను అని రిజక్ట్ చేశారట. దాంతో శోభన్ ఈ సినిమాను ప్రభాస్ తో చేశారట. ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్, ప్రభాస్ మంచి మిత్రులయ్యారు.Mahesh Babu

Mahesh Babu

Follow Us
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..
పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు: ఈ 10 విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవా..
పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు: ఈ 10 విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవా..