Tollywood:ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో కమ్ డైరెక్టర్.. పిచ్చ ఫాలోయింగ్

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అబ్బాయి స్టార్ హీరో. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా తెలుగు నాట ఇతనికి బోలెడు ఫాలోయింగ్ ఉంది. కేవలం హీరోగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ నటుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. ఎవరికి తోచని కాన్సెప్టులు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు చేయడం.

Tollywood:ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో కమ్ డైరెక్టర్.. పిచ్చ ఫాలోయింగ్
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2024 | 9:05 AM

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అబ్బాయి స్టార్ హీరో. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా తెలుగు నాట ఇతనికి బోలెడు ఫాలోయింగ్ ఉంది. కేవలం హీరోగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ నటుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. ఎవరికి తోచని కాన్సెప్టులు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు చేయడం. ఈ క్వాలిటీస్ కారణంగానే అతనికి, అతని తీసే సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ యువత ఈ హీరో సినిమాలంటే తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఆ మధ్యన రాజకీయాల్లోకి అడుగు పెట్టి కొద్దిగా సినిమాలను తగ్గించేశాడీ స్టార్ హీరో. అయితే తనకు సినిమాలే కరెక్టంటూ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. మరి ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?క ష్టంగా ఉందా? అయితే ఆన్సర్ కూడా మేమే చెబుదాం లెండి. అతను మరెవరో కన్నడ సూపర్‌ స్టార్ ఉపేంద్ర అలియాస్‌ ఉప్పీ. బుధవారం (సెప్టెంబర్‌ 18) ఈ హీరో పుట్టిన రోజు. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఉప్పీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే క్రమంలో హీరో చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అదే.

ఇవి కూడా చదవండి

ఏ, రా, ఉపేంద్ర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయారు హీరో ఉపేంద్ర. అలాగే కన్యాదానం, ఒకేమాట, రక్తకన్నీరు, నీతోనే ఉంటాను, టాస్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, గని వంటి తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గతేడాది విడుదలైన కబ్జా సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా కూడా మారిపోయాడు. ప్రస్తుతం యూఐ పేరుతో మరో పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.100 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్లు పాత ఉపేంద్రను గుర్తు చేస్తున్నాయి. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు ఉపేంద్ర. ఇవాళ ఉప్పీ పుట్టిన రోజు కాబట్టి ఈ సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రజనీకాంత్ కూలీ సినిమాలో ఉపేంద్ర

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.