Tollywood: ఒకప్పుడు ఫ్లాప్ హీరో.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. సినిమా తీస్తే 100 కోట్లు రావాల్సిందే
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఇతని పేరు ఖచ్చితంగా ఉంటుంది. కేవలం టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు

పై ఫొటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. డైరెక్టర్, స్క్రీన్ రైటర్ తో పాటు నటుడు కూడా. చాలా మంది లాగే కెరీర్ ప్రారంభంలో హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాడు. రెండు, మూడు సినిమాల్లో నటించాడు. ఒక సినిమాలో మెయిన్ హీరోగా నటిస్తే, మరో సినిమాలో సైడ్ రోల్ పోషించాడు. లుక్స్, యాక్టింగ్ పరంగా మంచి మార్కులే వచ్చినా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు డైలాగ్ రైటర్ గా అవతారమెత్తాడు. కానీ అది కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఇక లాభం లేదనుకుని తనే మెగా ఫోన్ పట్టుకున్నాడు. ప్రారంభంలోనే ఫామ్ లో ఉన్న ఓ మెగా హీరోను పట్టుకున్నాడు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ తీసి యూత్ ను బాగా మెప్పించాడు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మరో యంగ్ హీరోను పట్టుకుని మరో ప్రేమ కథా చిత్రాన్ని తీశాడు. కానీ ఈసారి అనుకున్న రిజల్ట్ రాలేదు. నిరాశపడకుండా మరో క్రేజీ హీరోతో మరో మూవీ తీశాడు. ప్రశంసలు అయితే వచ్చాయి కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. వరుసగా రెండు ఫ్లాప్ లు పడితే ఏ డైరెక్టర్ అయినా డీలా పడతాడు. కానీ ఇతను మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందు కెళ్లాడు. ఓ స్టార్ హీరోను తీసుకుని ఓ సామాజిక సందేశంతో కూడిన సినిమాను తీశాడు. అంతే బొమ్మ బ్లాక్ బస్టర్. కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ఆ తర్వాత మరో స్టార్ హీరోతో మరో మూవీ. ఈసారి ఏకంగా 100 కోట్ల బొమ్మ పడింది. అందుకే ప్రస్తుతం ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోతోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా తెరకెక్కిస్తోన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకీ అట్లూరి.
వెంకీ అట్లూరి డైరెక్టర్‌గా పరిచయం కావడానికి ముందు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. మొదట 2007లో జ్ఞాపకం అనే సినిమాలో సోలో హీరోగా నటించాడు. ఆ తర్వాత 2010లో వచ్చిన స్నేహగీతం సినిమాలోనూ హీరోగా చేశాడు. ఈ స్నేహగీతంలో సందీప్ కిషన్, కృష్ణ చైతన్యతో పాటు మరో హీరోగా వెంకీ అట్లూరి నటించాడు. ఆ తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత సినిమాలకు డైలాగ్ రైటర్ గా వ్యవహరించాడు. ఆపై మెగా ఫొన్ పట్టి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు.
గద్దర్ అవార్డ్ అందుకుంటోన్న వెంకీ అట్లూరి..
View this post on Instagram
మజ్ఞు, రంగ్ దే సినిమాలు నిరాశపర్చినా ధనుష్ తో సార్ సినిమాను తెరకెక్కించిన సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ ను తెరకెక్కించి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








