AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 11 ఏళ్లకే సినిమాల్లోకి.. తోటి హీరోతో ప్రేమ వివాహం.. ఇప్పుడేమో ఇండస్ట్రీకి దూరంగా.. గుర్తు పట్టారా?

చాలామంది హీరోయిన్ల లాగే ఈ అమ్మడు ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 15 ఏళ్లకే నటిగా సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదే క్రమంలో ఓ తోటి హీరోతో ప్రేమలో పడింది.

Tollywood: 11 ఏళ్లకే సినిమాల్లోకి.. తోటి హీరోతో ప్రేమ వివాహం.. ఇప్పుడేమో ఇండస్ట్రీకి దూరంగా.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 23, 2025 | 4:19 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. 1 ఏళ్లకే ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగు ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిది. అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడీ అందాల తార సినిమాల్లో నటించడం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక యంగ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాతే క్రమంగా సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తన ఫొటోస్ వీడియోలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది వితికా షేరు. ఆ తర్వాతఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. పలు కన్నడ సినమాల్లో నటిగా మెప్పించిన ఈ అందాల తార ప్రేమించు రోజుల్లో అనే సినిమాతో తెలుగు ఆడియెన్స ను పలకరించింది. ఆ తర్వాత సందడి, మంచు మనోజ్ నటించిన ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. తమిళ్ లోనూ ఒకటి రెండు సినిమాలు చేసింది వితికా.

ఇవి కూడా చదవండి

వైట్ శారీలో వితికా షేరు..

ఇక వరుణ్ సందేశ్ ను ప్రేమ వివాహం చేసుకున్న వితికా షేరు ఇప్పుడు టీవీ షోస్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. కాగా తెలుగు ఫేమస్ రియాలిటీ షోలో బిగ్ బాస్ లో భర్తతో కలిసి పాల్గొంది వితిక.

భర్త వరుణ్ సందేశ్ తో..

భద్రాలం టెంపుల్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.