AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నెట్టింట హాట్ అటమ్‌బాంబ్

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సినిమా తారల చిన్ననాటి ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. అలా ఇవాళ (ఫిబ్రవరి 21) ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నెట్టింట హాట్ అటమ్‌బాంబ్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 21, 2025 | 10:28 AM

Share

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మది సుమారు 12 ఏళ్ల ప్రస్థానం. అయితే ఎందుకో గానీ ఈ అందాల తార స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఒక స్టార్ హీరోయిన్ కు ఉండే క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. గతంలోలా ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే గతంలో చాలా ట్రెడిషినల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిపోయింది. గ్లామరస్ ఫొటోస్ అండ్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు బాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేదిక.

శుక్రవారం (ఫిబ్రవరి 21) వేదిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో వేదిక చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వేదిక లేటెస్ట్ వీడియో..

ప్రస్తుతం వేదిక తమిళ్, కన్నడ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. తెలుగులో చివరిగా ఫియర్ అనే సినిమాలో నటించింది. గతేడాది డిసెంబర్ లో ఈ సినిమా రిలీజైంది. అంతకు ముందు రజాకార్ అనే సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది వేదిక. అలాగే మంచులక్ష్మి నటించిన యక్షిణి వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక తమిళ్, ఒక కన్నడ సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి