AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరే.. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఏంటిలా మారిపోయాడు? షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అలాంటి హ్యాండమ్స్ హీరో ఇప్పుడు అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయాడు. ఊర మాస్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.

Tollywood: అరే.. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఏంటిలా మారిపోయాడు? షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 23, 2026 | 8:11 PM

Share

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అంతకు ముందు విరూపాక్షతో 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మెగా హీరో గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశాడు. ప్రస్తుతం అతను సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార, మంగళవారం సినిమాల ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్ బ్యానర్ సంస్థ అధినేతలు . కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సీనియర్ హీరో శ్రీకాంత్ పుట్టిన రోజు (మార్చి 23)ను పురస్కరించుకుని సంబరాల ఏటిగట్టు చిత్ర బృందం ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

సంబరాల ఏటి గట్టు సినిమాలో హీరో శ్రీకాంత్ బ్రిటిషు అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో శ్రీకాంత్ చాలా కొత్త లుక్ లో కనిపించారు. చిరిగిన బ్రిటిష్ యూనిఫామ్ ధరించి న ఆయన గుబురు గడ్డం, పొడవైన వెంట్రుకలతో అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించారీ సీనియర్ యాక్టర్. ఈ లుక్ చూస్తే ఈ చిత్రంలో ఆయన పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుందని సమాచారం. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్ లో సంబరాల యేటిగట్టు సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ కు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే విషెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us