Tollywood: ఈ ఫొటోలోని మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. భార్య కూడా ప్రముఖ నటినే
ఇతను హీరోగా నటించిన మొదటి సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. అప్పటివరకు ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ సరదాగా కనిపించే ఈ నటుడు సినిమాలో మాత్రం తన అద్భుత నటనతో ఏడిపించేశాడు. సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మన తెలుగు సినిమా హీరోలు, నటీనటుల్లో చాలా మంది కెరీర్ ప్రారంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా మెప్పించిన వాళ్లే. అందులో పై ఫొటోలో ఉన్న హీరో కూడా ఒకడు. మరి అతనెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ నటుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. ఇటీవలే హీరోగా కూడా మారిపోయాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు తన నటనతో కడుపుబ్బా నవ్వించిన ఈ యాక్టర్ సినిమాలో మాత్రం అందరితో కన్నీళ్లు పెట్టించాడు. అన్నట్లు తన మొదటి సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరించాడు. దగ్గరుండి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. తనే గోడలపై తన సినిమా పోస్టర్లు అంటించుకున్నాడు. సినిమా థియేటర్లకు వెళ్లేసి తనే స్వయంగా టికెట్లు అమ్మాడు. అలా అందరి నోళ్లల్లో నానిన ఆ నటుడు మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్. ఇది అతని చిన్ననాటి ఫొటో. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాకింగ్ రాకేష్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను పంచుకున్నాడు. అందులో రాళ్లపల్లి, శివారెడ్డి వంటి ప్రముఖ నటీనటులతో తన చిన్నతనంలో దిగిన ఫొటోలను అందులో షేర్ చేశాడు. ‘మా గురువుగారు రాళ్ళపల్లి గారిని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారిని స్మరిస్తూ ప్రపంచ రంగస్థలం దినోత్సవ శుభాకాంక్షలు. నా 11 సంవత్సరాల వయసులో కళమ్మ తల్లి ఆదరణ రంగస్థలంపై ప్రేమ”మిమిక్రీ” నేర్పిన ఎన్నో పాఠాలు నా ఈరోజు’ అంటూ తన గురువులందరినీ స్మరించుకున్నాడు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరలవుతోంది. ఇందులోని ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
కొన్ని నెలల క్రితం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమాతో హీరోగా మారాడు రాకింగ్ రాకేష్.గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో అనన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. కేసీఆర్ టైటిల్ పెట్టడం, భారీగా ప్రమోషన్లు నిర్వహించడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.
రాకింగ్ రాకేష్ ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించాడు రాకింగ్ రాకేష్. ముఖ్యంగ జబర్దస్త్ తో ఈ నటుడి జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. మొదట కంటెస్టెంట్ గా ఆ తర్వాత టీమ్ లీడర్ గా బుల్లితెర అభిమానులను బాగా నవ్వించాడు రాకేష్. ఇదే క్రమంలో తన జబర్దస్త్ జోడీ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది.
భార్య జోర్దార్ సుజాతతో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.