AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి, బాలయ్యలతో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? రికార్డులు మడతెట్టడానికి రెడీ

చిరంజీవి, బాలకృష్ణలతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. గత కొన్ని రోజులుగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాగనీ అతను ఒక్క సినిమా కూడా చేయలేదు

Tollywood: చిరంజీవి, బాలయ్యలతో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? రికార్డులు మడతెట్టడానికి రెడీ
Chiranjeevi, Balakrishna
Basha Shek
|

Updated on: Sep 12, 2024 | 7:05 PM

Share

చిరంజీవి, బాలకృష్ణలతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. గత కొన్ని రోజులుగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాగనీ అతను ఒక్క సినిమా కూడా చేయలేదు. తాత, తండ్రి నట వారసత్వాన్ని అందుకునేందుకు రెడీ అవుతోన్న ఈ స్టార్ కిడ్ మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ. ఇది అతని చిన్నప్పటి ఫొటో. అభిమానుల ఎదరుచూపులకు తెర దించుతూ సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడీ నందమూరి హీరో. ఇటీవలే మోక్షు పుట్టిన రోజు (సెప్టెంబర్ 6) సందర్భంగా అతని మొదటి సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ప్రశాంత్ వర్మ మోక్షను లాంఛ్ చేసే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదే సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు బాలయ్య వారసుడు. నందమూరి అభిమానులు కూడా ఈ పోస్టర్ ను చూసి తెగ మురిసిపోతున్నారు. కాగా మోక్షజ్ఞతో పాటు అతని సోదరి నందమూరి తేజస్విని కూడా ఇదే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. మోక్షు సినిమాకు ఆమె కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా 30 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ, ఫస్ట్ సినిమానే సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ సినిమా కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే మోక్షజ్ఞ మూవీ గురించి సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల చర్చలు నడుస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని నెట్టింట కోడై కూస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞ మూవీలో కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్..

తాతయ్య పేరు నిలబెట్టాలి.. ఎన్టీఆర్ విషెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో