AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్లకు మెంటలెక్కించింది.. పద్దతికి చీరకట్టినట్లుగా ఉంటుంది.. ఎవరో తెలుసా..?

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె ఓ టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మదిలో దేవతగా నిలిచిపోయింది. అందం, అభినయంతో మెప్పించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఊహించని సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

Tollywood: ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్లకు మెంటలెక్కించింది.. పద్దతికి చీరకట్టినట్లుగా ఉంటుంది.. ఎవరో తెలుసా..?
Heroine
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2024 | 8:54 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె ఓ టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మదిలో దేవతగా నిలిచిపోయింది. అందం, అభినయంతో మెప్పించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఊహించని సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు ఆగంతకులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఒకప్పుడు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఆ హీరోయిన్ కిడ్నాప్ వ్యవహరం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన తర్వాతా చాలా సంవత్సరాలు సైలెంట్ అయిన ఆ హీరోయిన్ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తున్న ఆ బ్యూటీ.. ఇప్పుడు జిమ్ వర్కవుట్ ఫోటోలను పంచుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తనే మహత్మా మూవీ బ్యూటీ భావన మీనన్.

మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ చిత్రసీమలో అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది భావన. శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అఏయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గడంతో తిరిగి మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. అదే సమయంలో భావన కిడ్నాప్ కు గురైంది. ఓ స్టార్ హీరో ఆమెను దుండగులతో కిడ్నాప్ చేయంచి లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఘటన తర్వాత సైలెంట్ అయ్యింది భావన. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. మలయాళంలో నడికార్ అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం తనకు అవకశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.